పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్ - కేటీఆర్ వర్కర్స్‌తో లంచ్
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 3:16 PM IST
KTR lunch with Sanitation Workers in Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు 2023కు ఘనంగా వీడ్కోలు పలికి అంతకుమించి గ్రాండ్‌గా 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈ ఏడాదంతా ఎంతో ఉత్సాహంగా ఉండాలని ఆశిస్తూ ఉత్సాహంగా న్యూ ఇయర్(New Year 2024)కు వెల్కమ్ చెప్పారు. కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజలకు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) పారిశుధ్య కార్మికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
Sanitation Workers New Year Wishes to KTR : నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్లో పారిశుధ్య కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారితో కాసేపు కేటీఆర్ ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త ఏడాదిని పలువురు పురస్కరించుకొని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.