KTR at Nizam College Hyderabad : 'నేనిక్కడే చదువుకున్నా.. ఈ కాలేజ్‌తో ఎన్నో జ్ఞాపకాలున్నాయి'
🎬 Watch Now: Feature Video
KTR at Nizam College Hyderabad : ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో యూనివర్సిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాలలో బాలుర వసతిగృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. నిజాం కళాశాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఐటీ శాఖ మంత్రి గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న నిజాం కాలేజీ అభివృద్ధికి అండగా ఉంటానని.. ప్రభుత్వ వర్సిటీల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించడానికైనా సిద్ధమని చెప్పారు.
KTR Memories With Nizam College Hyderabad : ఉన్నత విద్యకోసం సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యమాల కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి.. మౌళిక సదుపాయాల నిమిత్తం రూ.144 కోట్లు, ఇతర విశ్వ విద్యాలయాలకు రూ.500 కోట్లు ముఖ్యమంత్రి ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలు, గురుకులాల వల్ల ఉన్నతవిద్య అభ్యసించే అమ్మాయిల శాతం పెరుగుతోందని స్పష్టం చేశారు.