ఓటు వేసి గెలిపించమని కోరితే - డబ్బులు ఎక్కడ అని అడుగుతున్నారు : బర్రెలక్క - కొల్లాపూర్ ఎమ్మెల్యే పొలిటికల్ న్యూస్
🎬 Watch Now: Feature Video


Published : Nov 24, 2023, 7:32 PM IST
Kollapur Independent Candidate Barrelakka Interview : నిరుద్యోగిగా ఎదుర్కొన్న కష్టాన్ని.. సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చిన యువతి శిరీష. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మరిపెడకు చెందిన శిరీష.. బర్రెలక్కగా సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ పరిచయమయ్యారు. తన సమస్యను రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో.. ఎంతో సాహసమైనా.. ధైర్యంగా.. ఎన్నికల బరిలో దిగారు. ఊహించని రీతిలో స్పందన రావడంతో.. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం కారణంగా ఎన్నికల్లో నామినేషన్ వేశానని తెలిపారు.
Kollapur Candidate Shireesha Exclusive Interview : నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఇళ్లు సరిగా లేవనే అంశాలతో పాటు ప్రజా సమస్యలను తన మేనిఫేస్టోలో ఉంచినట్లు శిరీష పేర్కొన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం రాకపోతే ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. ప్రజలకు సేవా చేయాలనే నిస్వార్థంతోనే ఎన్నికల్లో నిలబడినట్లు తెలిపారు. అడ్డంకులు ఎదురవుతున్నా.. జంకులేకుండా ముందుకెళ్తూ.. ప్రజా మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్న శిరీష.. అలియాస్ బర్రెలక్కతో ప్రత్యేక ముఖాముఖి.