Kishan Reddy Visited Medaram Sammakka Sarakka Temple : 'బీజేపీ అధికారంలోకి రాగానే.. గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తాం' - కిషన్​రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 2:27 PM IST

Kishan Reddy Visited Medaram Sammakka Sarakka Temple : బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలుచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన.. ముందుగా గిరిజన ఆరాధ్య దైవం గట్టమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గట్టమ్మ ఆలయ సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. రూ.900 కోట్లతో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు.

అక్కడి నుంచి కిషన్​రెడ్డి మేడారం బయలుదేరి వెళ్లారు. అనంతరం సమ్మక్క-సారాలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న కేంద్రమంత్రి కిషన్​రెడ్డి.. మోదీ నేతృత్వంలోని భారతదేశం మరింత అభివృద్ధి పథంలో సాగాలని ఆకాక్షించారు. ప్రపంచానికి భారత్‌ను విశ్వగురువుగా నిలిపే శక్తిని మోదీకి ఇవ్వాలని కోరుకుంటున్నానని మొక్కుకున్నానని తెలిపారు. ట్రైబల్​ సర్క్యూట్​ పేరుతో ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశీలన ఈటల రాజేందర్​తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.