Kishan Reddy Auto Journey in Hyderabad : సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి - Kishan Reddy Auto Journey

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 2:32 PM IST

Kishan Reddy Auto Journey in Hyderabad : స్థాయి ఎంత పెద్దది అయినా తాము ప్రజలకోసం పనిచేసే నేతలం అని కొందరు నాయకులు ఎప్పుడూ మరిచిపోరు. ఈ విషయంలో కేంద్రమంత్రి, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏమాత్రం తీసుపోరనే చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కార్లలో తిరిగే కేంద్రమంత్రి.. ఓ సామాన్యుడిలా ఆటోలో ఎక్కి ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు రైల్వే సర్వీసులను ప్రారంభోత్సవానికి విచ్చేసిన కిషన్ రెడ్డి.. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ప్యాట్నీ నుంచి పరేడ్ గ్రౌండ్ వరకు ఇలా ఆటోలోనే ప్రయాణం చేశారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని చూసేందుకు వాహనదారులు ఎంతో ఆసక్తిని కనబరిచారు.

Kishan Reddy Started Four Train Services Telangana : రాష్ట్రంలో నాలుగు రైలు సర్వీసులకు ఇవాళ జెండా ఊపి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పొడిగించిన నాలుగు సర్వీసుల వివరాలను దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది. హడప్సర్ - హైదరాబాద్ ఎక్స్‌ ప్రెస్ కాజీపేట వరకు, జైపూర్ - కాచిగూడ  ఎక్స్‌ ప్రెస్ కర్నూలు సిటీ వరకు, నాందేడ్ - తాండూరు ఎక్స్‌ ప్రెస్ రాయచూర్ వరకు, కరీంనగర్ - నిజామాబాద్ ఎక్స్‌ ప్రెస్ లను బోధన్ వరకు పొడిగించారు. పొడిగించిన అన్ని సర్వీసులకు బుకింగ్‌లు మొదలుపెట్టినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.