King Cobra In Kitchen Viral Video : కిచెన్​లోకి 15 అడుగుల కింగ్​ కోబ్రా.. ఒక్కసారిగా మహిళలు భయపడి.. - నాగుపాము వైరల్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 8:40 PM IST

Updated : Sep 11, 2023, 9:50 PM IST

King Cobra In Kitchen Viral Video : ఇంట్లోని వంటి గదిలోకి ఓ 15 అడుగుల నాగు పాము చొరబడి కలకలం సృష్టించింది. అక్కడే వంట చేస్తున్న మహిళలు.. అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​లో ఈ ఘటన జరిగింది.

అసలేమైందంటే?
రిషికేశ్ మున్సిపల్ కార్పొరేషన్​​లోని శివాజీనగర్​ ప్రాంతానికి చెందిన వినేశ్​ ఇంట్లోకి 15 అడుగుల నాగు పాము చొరబడింది. వంటగదిలోకి వెళ్లిన ఆ నాగు పామును అక్కడే ఉన్న ఓ మహిళ చూసింది. వెంటనే తన కుటుంబసభ్యులకు చెప్పి అప్రమత్తం చేసింది. అంతా కలిపి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అయితే పాము పడగపైకెత్తిన ఫొటోను స్థానికులు.. అటవీశాఖ అధికారులకు పంపారు. 

ఫొటోను చూసిన అటవీ శాఖ అధికారులు.. నాగు పాముగా ధ్రువీకరించి వినేశ్ ఇంటికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును పట్టుకున్నారు. స్థానికంగా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సర్పాన్ని విడిచిపెట్టారు. రిషికేశ్​లో పాములు ఎక్కువగా కనపడవని అటవీ శాఖ ఉద్యోగి కమల్​ రాజ్​పుత్​ తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగానే కోబ్రా.. ఇంట్లోకి చొరబడిందని వివరించారు.

Last Updated : Sep 11, 2023, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.