Kids Fashion Show in Madhapur : చిచ్చర పిడుగులాంటి చిన్నారుల ఫ్యాషన్ షో.. ర్యాంప్‌పై అబ్బురపరిచిన ప్రదర్శనలు ! - కిడ్స్ ఫ్యాషన్ షో 2023
🎬 Watch Now: Feature Video
Kids Fashion Show in Madhapur : ముద్దులొలికే చిన్నారులు.. తమ బుడి బుడి నడకలతో ఔరా! అనిపించారు. మోడల్స్‌ను మరిపించేలా ర్యాంప్‌పై హంస నడకలతో అదరహో అనిపించారు. చూడముచ్చటైన వస్త్రధారణతో చూపరులను కట్టిపడేశారు. ఇండియన్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా.. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో ఏర్పాటు చేసిన కిడ్స్ ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ పంచెకట్టు, రంగు రంగుల దుస్తుల్లో ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాస్ట్‌బీట్ పాటల సంగీతానికి సై సై అంటూ చిందులేచారు. ఎలాంటి బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ ఆడియెన్స్‌ను కట్టిపడేశారు. ఒకవైపు అమాయకపు చూపులు.. మరోవైపు హుషారుగా అడుగులు చిందిస్తూ వీక్షకులకు కనువిందు చేశారు. చిచ్చర పిడుగులాంటి చిన్నారులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో, డ్యాన్స్‌లకు ప్రేక్షకులు చప్పట్లుతో హోటల్ ప్రాంగణమంతా హోరెత్తింది. 8 ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన పలువురు డిజైనర్లు రూపొందించిన దుస్తులను చిన్నారులు షోలో ప్రదర్శించి మెప్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చేస్తున్న ఫ్యాషన్ షోను చూస్తూ మురిసిపోయారు. చిన్నపిల్లలతో ఇలాంటి ఓ షో నిర్వహించడం చూడముచ్చటగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.