KCR Bheema Scheme in Telangana : 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా.. 100 శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది'
🎬 Watch Now: Feature Video
KCR Bheema Scheme in Telangana : రైతు బీమా తరహాలో... తెల్ల రేషన్ కార్డుదారులకు... బీమా అమలు చేస్తామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎల్ఐసీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి... పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్ భరోసా కల్పించారు. ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్.. బీఅర్ఎస్ నాయకులు జిల్లాల్లో పర్యటించే సమయంలో రైతు కూలీలకు కూడా రైతు బీమా వర్తింపచేయాలని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు.
దీనిపై ఆలోచించి కొత్త స్కీమ్ తీసుకురావాలని అనుకున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఒక కోటి పది లక్షల కుంటుబాలు ఉన్నాయని.. ఈ కొత్త పథకాన్ని రైతు కూలీలకే కాక... అర్హులైనందరికి ఇచ్చే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కేసీఆర్ బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డు ఉందన్నారు. కేసీఆర్ బీమా పథకానికి 100 శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.