MLA Rajaiah Vs Sarpanch Navya : మరోసారి తెరపైకి 'ఎమ్మెల్యే రాజయ్య.. సర్పంచ్ నవ్య' వివాదం - హనుమకొండ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2023, 2:05 PM IST

Janakipuram Sarpanch Fires on MLA Rajaiah : ఎమ్మెల్యే రాజయ్యపై జనగామ జిల్లా జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి విమర్శలు గుప్పించారు. గతంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని.. అగ్రిమెంట్ బాండ్‌పై సంతకం చేయాలని.. రాజయ్య.. తన భర్తకు డబ్బులు ఆశ చూపారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తన వెనక ఓ బడా నేత ఇదంతా చేయించినట్లు.. ఆ పేపర్లపై సంతకం చేయాలని అంటున్నారని మీడియాకు తెలిపారు. తన భర్త వాటిపై సంతకం పెట్టాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.

మరోవైపు గ్రామాభివృద్ధికి గతంలో రూ.25 లక్షలు ఇస్తామని చెప్పిన రాజయ్య.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నవ్య దుయ్యబట్టారు. కానీ తాను ఆ డబ్బులు తీసుకున్నట్లు వదంతులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అవన్నీ అవాస్తవాలని కొట్టి పారేశారు. ఓ మహిళా ప్రజాప్రతినిధి.. తన భర్తను ట్రాప్ చేసి తమ కుటుంబంలో చిచ్చు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బందులు పెడుతున్న అందరి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటిని త్వరలోనే బయటపెట్టి.. నిజాయితీని నిరూపించుకుంటానని నవ్య స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.