Jagadish Reddy Fire on Revanth Reddy : "రేవంత్‌రెడ్డికి అమరవీరుల స్తూపం వద్ద చర్చించే అర్హత లేదు" - Jagadish Reedy React on Revanth Reddy Comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2023, 4:39 PM IST

Jagadish Reddy Fire on Revanth Reddy : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై చేసిన విమర్శలపై బీఆర్​ఎస్​ ఎదురుదాడికి దిగింది. రేవంత్‌ వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది ప్రజలకు పిండాలు, తద్దినాలు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ఉందన్నారు. అందుకే ఆ పార్టీల నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్​కు పిండం పెడతామని మాట్లాడుతున్నాడని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish Reddy) విమర్శించారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని సమర్థిస్తూ వచ్చిన రేవంత్‌రెడ్డికి అమరవీరుల స్తూపం వద్ద చర్చించే అర్హత లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాగాయకుడు గద్దర్​ ఆశయాలు, లక్ష్యాలు నెరవేర్చిన ప్రభుత్వం బీఆర్​ఎస్​దే అని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో కొంత కాలంగా గద్దర్​ ఉద్యమాలు చేయలేదని చెప్పారు. మిగిలిన ఆయన ఆశయాలను ఎప్పటికైనా బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూర్తి చేస్తుందని వెల్లడించారు. గద్దర్​ పోరాటం చేసింది కాంగ్రెస్​ పార్టీపైనే అని గుర్తు చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.