''పది' లీకేజీ కేసు.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా..?' - 10తరగత పేపర్ లీకేజీ కేసు
🎬 Watch Now: Feature Video
Bandi Sanjay Interview : ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుమారుడిని భర్తరఫ్ చేసి.. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు పరిహారం అందించే వరకు బీజేపీ పోరాటం ఆగదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంపై ఇప్పటికీ సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ అనేక పోరాటాలు చేస్తోందన్నారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పదో తరగతి ప్రశ్నాపత్రం బయటికొచ్చిందంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు.
హిందీ ప్రశ్నాపత్రం బయటికి వచ్చిందంటున్నారు.. మరి తెలుగు పేపర్ సంగతేంటిని సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ.. ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
అరెస్ట్ గొడవతో.. తన ఫోన్ పట్టుకెళ్లి మళ్లీ తననే అడుగుతున్నారని బండి సంజయ్ అన్నారు. అయినా నా ఫోన్ ఇస్తే ఏం చేస్తారు.. అందులో ఏముంటుందని ఎద్దేవా చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. నిరుద్యోగులకు న్యాయం కోసం వరంగల్ నుంచి పోరాటాలు ప్రారంభిస్తామంటున్న బండి సంజయ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..