Hyderabad Hotel Manager Shot Dead : ఉద్యోగం పోయిందనే కోపంలో.. హోటల్​ జనరల్‌ మేనేజర్‌పై కాల్పులు

🎬 Watch Now: Feature Video

thumbnail

Hyderabad Hotel Manager Shot Dead : హైదరాబాద్​లో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్​పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి పరారయ్యాడు. గాయపడిన దేవేందర్‌ను హోటల్‌ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తాజాగా ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

Miyapur Firing Incident : విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు. పోలీసులు, క్లూ టీమ్‌ అన్నీ వివరాలను సేకరించాయి. ఇప్పటికే ఘటనా స్థలిలో 6 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కేసును కొద్ది గంటల్లోనే ఛేదించారు. 'నిందితుడిని రితీశ్​ నాయర్‌గా గుర్తించారు. కేరళకు చెందిన నిందితుడు రితీశ్​ నాయర్‌, దేవేందర్ గాయన్ గతంలో ఒకేచోట మేనేజర్లుగా పనిచేశారు. నెల రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇదే క్రమంలో రితీశ్​, దేవేందర్​పై చేయిచేసుకున్నాడు. ఇదే విషయాన్ని హోటల్‌ యాజమాన్యానికి దేవేందర్ ఫిర్యాదు చేశాడు. దీంతో రితీశ్​ను యాజమాన్యం తొలగించింది. దేవేందర్ వల్లే ఉద్యోగం పోయిందని రితీశ్ అతడిపై​ కక్ష పెంచుకున్నాడు. 

Hyderabad Hotel Manager Shot Updates : బుధవారం రాత్రి దేవేందర్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో రితీశ్​ రెక్కీ నిర్వహించి వెంట తెచ్చుకున్న కంట్రీ మేడ్ పిస్తోల్​తో అతనిపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. తనని ఎవరూ గుర్తు పట్టకుండా తలకు హెల్మెట్‌ ధరించాడు. తీవ్ర గాయాలైన దేవేందర్​ ఆసుపత్రికి చేరేలోపే మృతి చెందాడు.' అని పోలీసులు తెలిపారు. దేవందర్ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. హత్యకు వాడిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Last Updated : Aug 24, 2023, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.