Rajadhani Bus Fire Accident : హైదరాబాద్ నుంచి వెళ్తున్న రాజధాని బస్సులో అగ్నిప్రమాదం - హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
TSRTC Rajadhani Bus Fire Accident : ఈ మధ్య కాలంలో బస్సులలో తరచుగా అగ్నిప్రమాదాలు సంభవించడం చూస్తున్నాం. ఈ ఘటనలలో భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. తాజాగా భాగ్యనగరం శివారులో అర్ధరాత్రి ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గ్రహించిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగర శివారు ప్రాంతం పెద్దఅంబర్‌పేట్ ఓఆర్ఆర్ సమీపంలో బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన ఆర్టీసి బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణికులను బస్సు నుంచి కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ఏసీలో నుంచి మంటలు చెలరేగాయని ప్రాధిమికంగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. అందులో ప్రయాణిస్తున్న 45మంది ప్రయాణికులు సంరక్షతంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల వస్తువులు కాలిపోయాయన్నారు.