అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు - లైవ్ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే! - Car Accident
🎬 Watch Now: Feature Video
Published : Jan 14, 2024, 7:28 PM IST
|Updated : Jan 14, 2024, 8:04 PM IST
Husnabad Car Accident Live Video : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పండుగ పూట విషాద ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్- కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఆ ఘటనలో కారులోని యశ్వంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు యువకులకు గాయాలు కాగా, హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారంతా హుస్నాబాద్‌కు చెందిన మైనర్ యువకులుగా పోలీసులు గుర్తించారు.
Karimnagar Car Accident Viral Video : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన యువకులంతా కారులో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడే రోడ్డుపై నిలిపి ఉంచిన మరో కారు ముందు కెమెరాలో ఘటన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కారు బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు ఈ దృశ్యాల్లో కనిపిస్తుంది. కారు పల్టీలు కొడుతున్న సమయంలో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడితే ప్రమాద పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.