కిక్కిరిసిన నిర్మల్ బస్టాండ్ - సీటు కోసం డ్రైవర్ క్యాబిన్ ద్వారా బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులు - మహిళలుకు ఉచిత బస్సు ప్రయాణం
🎬 Watch Now: Feature Video
Published : Dec 10, 2023, 4:56 PM IST
|Updated : Dec 10, 2023, 8:04 PM IST
Huge Crowd at RTC Bus Stand : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉండడంతో బస్సులో సీటు దొరుకుతుందో లేదో అని కొందరు మహిళలు డ్రైవర్ క్యాబిన్ ద్వారా బస్సు ఎక్కారు. దీంతో అక్కడున్న ప్రయాణికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. నిర్మల్ బస్టాండ్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Free Bus Scheme for women : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలలో నిన్న రెండు పథకాలను అమలు చేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీని ద్వారా వారు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.