How To Register in U-win Portal : 'యూ విన్' పోర్టల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలుసా..? - Hyderabad DMHO on U win Portal
🎬 Watch Now: Feature Video
How To Register in U-win Portal : పుట్టిన క్షణం నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు అనేక రకాల టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫలితంగా వారి బంగారు భవిష్యత్ సురక్షితం అవుతుందని వైద్యులు చెబుతారు. ఈ క్రమంలో టీకాలు ఎప్పుడు వేయించాలి.. ఎక్కడ వేయించాలి.. అనేది తల్లిదండ్రులకు పెద్ద సమస్యే. సమయానికి పనిమీద వేరే ప్రాంతాలకు వెళ్తే టీకా సమయం మించిపోయి ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడి వారైనా.. తాము ఉన్న చోటుకి దగ్గర్లోనే టీకా వేయించుకునే సౌకర్యం కల్పిస్తూ.. "యూ విన్" పేరుతో కేంద్రం ఓ కొత్త పోర్టల్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిన్ తరహాలోనే పనిచేస్తుందంటున్న ఈ యూవిన్(U-win Portal For Vaccination)లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? దాని వల్ల ఉపయోగాలు ఏంటి? అనే వివరాలను హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటీ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
"ఇంతకముందు వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు ఆఫ్లైన్ ఉండేది. ఎంతమందికి వ్యాక్సినేషన్ వేశామనేది చెప్పాల్సివస్తే.. మా దగ్గర ఉన్న రిజిస్టర్ల ద్వారా ఎవరెవరికి వేశామని చూసుకునేవాళ్లం. ఇప్పుడు ఈ యూ-విన్ సిస్టమ్ అంతా అన్లైన్ అయింది. అన్లైన్ అవడం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడున్న వారైనా రిజిస్టేషన్ చేసుకోవచ్చు." - వెంకటీ, హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్