Prathidhwani Temperature in TS : వేసవి తీవ్రత ఎప్పటి వరకు కొనసాగుతుంది..? - Discussion on temperatures
🎬 Watch Now: Feature Video
Prathidhwani on Temperature in TS : మండుతున్న ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎక్కడ చూసినా.. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. కొన్ని ప్రాంతాలైతే నిప్పులు కొలిమినే తలిపిస్తున్నాయి. వడగాల్పులు, వడదెబ్బ మరణాలు కలవర పెడుతున్నాయి. రాష్ట్రంలోని ప్రజలు ఇంటి నుంచి బయటకి రావాలంటే భయపడుతున్నారు. అత్యవసరమైనా బయటకి వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వడగాలుల వల్ల కొన్ని ప్రాణాలు పోయాయి. ఈ వేడి తీవ్రత మరిన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఎన్ని రోజులు కొనసాగవచ్చు? నిజానికి... ఇటీవలే నడివేసవిలో అకాలవర్షాలు వెంటాడాయి. ఇప్పుడు ఊహించని రీతిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అసలు ఈ వైరుధ్యమైన పరిస్థితులు ఎందుకు? నైరుతి రాక కూడా ఆలస్యం అంటున్న నేపథ్యంలో వేసవి తీవ్రత ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది.. అప్పటి వరకు అంతా తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.