heart attack video viral : షటిల్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి.. వీడియో వైరల్ - జగిత్యాల వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18655804-797-18655804-1685693889768.jpg)
Jagtial man died of heart attack : ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపుటలవాట్లు మనుషుల ఆయువును తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం మానవ జీవనశైలి ఆరోగ్యానికి చేటు చేస్తోంది. కరోనా తర్వాత జీవనశైలి మార్చుకుని చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఇందులో భాగంగానే డైట్, వ్యాయామం చేస్తున్నారు. అయితే ఎంత ఫిట్‌గా ఉన్నా.. ఈ మధ్య అందరినీ గుండెపోటు కలవరానికి గురి చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు చాలా మంది గుండెపోటుతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.
అప్పటిదాకా తమ స్నేహితులు.. బంధువులతో హాయిగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఏమైందో తెలుసుకునేలోగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా జగిత్యాలలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలాడు. ఏమైందని చూసేలోగానే ప్రాణాలు విడిచాడు.
జగిత్యాల క్లబ్‌లో షటిల్ ఆడుతూ బూసరాజ వెంకటగంగారాం అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గమనించిన తోటి ప్లేయర్లు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో గంగారాం కుప్పకూలిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలతో రికార్డయ్యాయి. గంగారామ్‌కు గతంలో గుండెకు సంబంధించి శస్త్రచికిత్స జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.