Harish Rao Interview : తొమ్మిదేళ్ల తెలంగాణ గురించి మంత్రి హరీశ్‌రావుతో ముఖాముఖి - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Harish rao Interview with Etv bharat : తొమ్మిదేళ్లలోనే క్షామ తెలంగాణ... సంక్షేమ తెలంగాణగా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్ని సాధించుకుని.. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ సిద్ధిపేటలో ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన హరీశ్‌రావు... తొమ్మిదేళ్ల పాలన ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. తెలంగాణ ఆచరిస్తే...దేశం అనుసరించేస్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఒకప్పుడు తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయన్న హరీశ్‌రావు...మళ్లీ కేసీఆర్ హ్యట్రిక్ కొట్టుడు ఖాయమని స్పష్టం చేశారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి దాకా తెలంగాణ కోసమే పాటు పడ్డాము. కష్టపడి తెలంగాణను సాధించుకున్నాము. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నాము. బీజేపీ వాళ్లు రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు చేస్తాము అంటున్నారు. ఉద్యమ కాలంలో ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటే చేయకుండా దిల్లీకి వెళ్లాడు. ఇప్పుడొచ్చి తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. విపక్షాలు ఎన్ని విమర్శించివప్పటికీ ప్రజలకు నిజానిజాలు తెలుసని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.