జై శ్రీరామ్.. జై హనుమాన్. ఘనంగా హనుమాన్ శోభయాత్ర - Hanuman Shobhayatra at vanastalipuram
🎬 Watch Now: Feature Video

హనుమాన్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియం నుంచి హనుమాన్ శోభాయాత్ర జరిగింది. పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ వాహనాలకు హనుమాన్ జండాలు, తలపై పైడిలతో యువత వెళ్లారు. యువకులతో పాటు మహిళలు జై హనుమాన్, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. మొదటగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లో నుంచి వచ్చిన బైక్ ర్యాలీలు సరూర్‌నగర్ స్టేడియంకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీని సుధీర్ రెడ్డి ప్రారంభించి బయలుదేరారు.
ఈ శోభాయాత్రలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఓవైపు మిరమిట్లు గొలుపే రంగురంగుల లైట్లు, డీజే పాటలతో శోభాయాత్ర కొనసాగింది. రోడ్డుపై పెద్ద ఎత్తున ర్యాలీ బయలుదేరినందున ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం, సాగర్ రింగ్ రోడ్, చంపాపేట్ మీదుగా కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ దేవాలయం వద్దకు చేరుకున్న అనంతరం శోభాయాత్ర ముగిసింది.