Gold seize at Hyderabad airport : చీరలో పాకెట్.. అందులో బంగారం.. స్మగ్లింగ్ ఐడియా అదిరింది గురూ.. - Hyderabad Latest News
🎬 Watch Now: Feature Video
Gold seize at shamshabad airport in Hyderabad : దుబాయ్ నుంచి హైదరాబాద్కు బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణికుడిని.. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 461 గ్రాముల బంగారాన్ని చీరలో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 28 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుడు కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. బంగారం అక్రమ రవాణాకు చీరలో ప్రత్యేకంగా అర వంటిది ఏర్పాటు చేశాడు. అధికారులు పరిశీలించి చూడటంతో అసలు నేరం బయటపడింది. ప్రయాణికుడిపై కస్టమ్స్ చట్టం 1962 కింద నమోదు చేసి విచారణకు ఆదేశించారు. విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తూ నిందితులు పట్టుబడిపోతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. బంగారం అక్రమ తరలింపు ఆగడం లేదు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం, డ్రగ్స్, కరెన్సీ తీసుకువస్తూ.. ఆ క్రమంలో పట్టుబడకుండా రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. కానీ చివరకు అధికారులకు పట్టుబడుతున్నారు.