thumbnail

By

Published : May 31, 2023, 4:06 PM IST

Updated : May 31, 2023, 4:14 PM IST

ETV Bharat / Videos

లక్కీ గర్ల్.. పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్న చిన్నారి

కర్ణాటక బెళగావి జిల్లాలోని హలగా గ్రామంలో ఓ బాలిక అదృష్టవశాత్తు నాగుపాము కాటు నుంచి తప్పించుకుంది. ఇంటి గుమ్మం వద్ద బుసలు కొడుతూ ఉన్న ఓ పామును గమనించకుండా అలాగే ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. బాలిక తలుపు వద్దకు రాగానే పాము తలపైకి ఎత్తి ఆమెను కరిచేందుకు చూసింది. అయితే కొన్ని క్షణాలు గుమ్మం డోర్​ దగ్గర నిలబడ్డ ఆ చిన్నారిని లోపల ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తం చేయడం వల్ల ఆమె ఇంట్లోకి పరుగులు తీసింది. క్షణాల్లోనే ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు గది దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి. ఈ వీడియో సోషన్​ మీడియాలో వైరల్​గా మారింది.

రెండు నెలల క్రితం కూడా అచ్చం ఈ తరహా ఘటనే కేరళలో వెలుగు చూసింది. ఇడుక్కి జిల్లా కూత్తర్​ పట్టణంలోని ఓ ఏటీఎం డోర్​ దగ్గర పాము కలకలం సృష్టించింది. నాగుపామును గమనించని ఓ మహిళ డబ్బు విత్​డ్రా కోసం ఏటీఎం లోపలకు ప్రవేశించింది. డ్రా చేసుకుని తిరిగి వెళుతుండగా డోర్​ దగ్గర బుసలు కొడుతున్న పామును చూసి ఒక్కసారిగా వణికిపోయింది. భయంతో డోర్ వెనక్కు వెళ్లి దాక్కుంది. కొన్ని నిమిషాలు గడిచాక అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఏటీఎంలోని మహిళను గమనించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. అదృష్టవశాత్తు ఆ మహిళను పాము కాటు వేయకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చూడాలనుకుంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : May 31, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.