గ్యాస్ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఎలా చెక్ చేయాలో తెలుసా? - సిలిండర్ గడువు తేదీ
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 2:01 PM IST
Gas Cylinder Precautions : నిత్యం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో వంటగ్యాస్ వినియోగం తప్పనిసరి. అలాంటి పరిస్థితుల్లో మన వంటింట్లోని గ్యాస్ సిలిండర్ వల్ల మనకు ప్రాణహాని ఉందని తెలిస్తే కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా పెను ముప్పు తప్పదు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వంట గ్యాస్ సిలిండర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి.
How to Check Gas Cylinder Expiry Date : సిలిండర్ బుక్ చేసిన దగ్గరి నుంచి అది ఇంటికొచ్చి వంటింట్లో చేరే వరకు అనుక్షణం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వంట గ్యాస్ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సిలిండర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలి. మరి మనకు వచ్చిన గ్యాస్ బండ గడువు తేదీ ఉందా, ముగిసిందా అన్న సమాచారాన్ని ఎలా గుర్తించాలి? అలాంటి గ్యాస్‌ను వంటింట్లోకి తీసుకెళ్లాలంటే ముందుగా మనం చూసుకోవాల్సినవి ఏంటి? కాలం చెల్లిన సిలిండర్లను ఎలా కనిపెట్టాలి? వాటితో ఎంత ప్రమాదం? అలాంటి విషయాలు ఇప్పుడు చుద్దాం.