Ganesh Immersion Issue at Tankbund : 'ట్యాంక్‌బండ్‌లోనే నిమజ్జనం చేస్తాం... ఎలా అడ్డుకుంటారో చూస్తాం'

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 5:43 PM IST

Ganesh Immersion Issue at Tankbund : పీవోపీ విగ్రహాలను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేయకూడదని ప్రభుత్వం పెట్టిన అంక్షలపై విశ్వహిందు పరిషత్‌, భాగ్యనగర గణేష్‌ ఉత్సవ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను వారు ఇవాళ పరిశీలించారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేస్తన్నామని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. హైకోర్టు ఆర్డర్‌ అని కుంటి సాకులు చూపించి ఆంక్షలు విధిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వానికి నిమజ్జన ఏర్పాట్లు చేయడం చేతకాకపోతే తామే ఏర్పాట్లు చేసుకొని విగ్రహాల నిమజ్జనం చేస్తామని తెలిపారు.

Public Protest Against Court Orders in Ganesh Immersion : పీవోపీ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోను ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం చేసి తీరుతామన్నారు. 44 సంవత్సరాలుగా వస్తున్న హిందు సంప్రదాయాల ఆనవాయితీకి.. అధికారులు భంగం కలిగిస్తున్నారన్నారు. మిగతా పండగలకు అన్ని సదుపాయలు ఏర్పాటు చేసే ప్రభుత్వం భాగ్యనగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలపై చిన్నచూపు చూడటం దారుణమన్నారు. ట్యాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందన్నారు. నిమజ్జనానికి వస్తున్న ప్రజలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని భాగ్యనగర గణేష్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవత్‌రావు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.