'కరోనా న్యూ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి - స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి' - గాంధీ ఆసుపత్రిలో కరోనా కేసులు
🎬 Watch Now: Feature Video
Published : Dec 19, 2023, 10:48 PM IST
Gandhi Hospital Superintendent Raja Rao on New Variant of Corona : ఇప్పుడిప్పుడే నాటి కరోనా గాయాలను కొంచెం కొంచెంగా మరిచిపోయి, స్వేచ్ఛా జీవితం గడుపుతున్నాము. ఈక్రమంలో మళ్లీ దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోందన్న వార్తలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. జిల్లా స్థాయి నుంచే కొవిడ్ టెస్టింగ్ నిర్వహించాలని సూచించింది. పాజిటివ్ కేసుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కి సైతం పంపాలని స్పష్టం చేసింది.
JN1 New Variant of Corona : ఈ నేపథ్యంలో ఓమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఈ కొత్త జేఎన్1 నిజంగా ఎంతవరకు ప్రమాదకరం కానుంది? రాష్ట్రంలో అసలు ఈ కొత్త వేరియంట్ ప్రవేశించిన దాఖలాలు ఉన్నాయా? దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుదల నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ఈటీవీ భారత్‌తో ముఖాముఖి నిర్వహించారు.