కవితకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు... నిన్న నిజామాబాద్లో.. నేడు మెట్పల్లిలో - telangana latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18141323-thumbnail-16x9-brs.jpg)
flexis against to mlc kavitha: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన సందర్భంగా రాత్రికి రాత్రే పట్టణ ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఫ్లెక్సీలు వెలిశాయి. చెప్పిన 100 రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ముందు నాన్నతో.. అన్నతో సెల్ఫీ అంటూ వారి ఫొటోలతో కూడిన ప్లెక్సీలను ఒకచోట... 500 కోట్లతో ఎన్నారై సెల్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట తప్పితే సీఎం తల నరుక్కుంటాడని, రెండు పడకల గదుల ఇండ్ల ఫోటో తో కవిత కుటుంబం గృహ ప్రవేశం చేస్తున్నట్లు మరోచోట ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. కొత్త బస్టాండ్, పాత బస్టాండు, డిపో వద్ద ఇలా పలుచోట్ల పోస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విషయం తెలుసుకున్న పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ వెంటనే ఫ్లెక్సీలను తొలగించారు. ఈ ఫ్లెక్సీలు ఎవరు కట్టారనే విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.