బీఆర్ఎస్ వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు - congress tries to tear brs flexi
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2023, 7:57 PM IST
Fight Between BRS and Congress Activists At Hanumakonda : హనుమకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార వాహన ఫ్లెక్సీని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేసేందుకు యత్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్‌షోలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచార వాహనం అదే రహదారిలో వచ్చింది. బీఆర్ఎస్ పాటలు వేసుకొని అటుగా పలుమార్లు తిరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వాహన ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకొని వాహనాన్ని పంపించారు.
Policeforce at Election Campaign : ఇప్పటికే పార్టీల ప్రచారంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యయత్నం తర్వాత పోలీసులు పటిష్ఠ భద్రతనూ పెంచారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభలు జరిగే చోట ముందస్తు చర్యలు చేపడుతున్నారు.