Farmers Protest In Nizamabad : బురదమయమైన రోడ్డు.. నిరసనగా వరి నాట్లు వేసిన గ్రామస్థులు - today telangana news
🎬 Watch Now: Feature Video
Farmers Protest In Nizamabad : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు నడిరోడ్డుపై వరినాట్లు నాటి.. వినూత్న నిరసనకు దిగారు. తమ ఊరుకు సరైన రోడ్డుమార్గం లేకపోవడాన్ని తెలుపుతూ.. మండల కేంద్రం నుంచి దూపల్లి, ఎడపల్లి మండల బ్రాహ్మణపల్లికి వెళ్లే దారిలో రోడ్లు అధ్వానంగా ఉన్న పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోయారు. దూపల్లి, బ్రాహ్మణపల్లి ప్రాంతాల్లో 8 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి రోడ్లు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు.
గుంతలుగా మారిన పంట పొలాల రోడ్లను బాగుచేయలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా స్వచ్ఛందంగా రైతులు నిరాహర దీక్ష చేపట్టినా ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదని అన్నదాతలు ఆవేదన చెందారు. రైతే రాజు, రైతు రాజ్యమంటూ ప్రగడ్బాలు పలికే రాష్ట్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని రైతులు మండిపడ్డారు. దీనికి నిరసనగా నడిరోడ్డుపై వరి నాట్లు నాటి తమ గోడును వినూత్నంగా వెలిబుచ్చినట్లు రైతులు వివరించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని కర్షకులు కోరారు.