మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీకి రెడీ - ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానం : మల్లారెడ్డి - Mallareddy
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2024, 5:27 PM IST
Ex Minister Mallareddy Press Meet at Medchal : పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్లోని పార్టీ ఆఫీసులో పీర్జాదిగూడ నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై విమర్శలు చేశారు.
Mallareddy About on Lok abha Election 2024 : రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఆరు గ్యారంటీలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఆరు పథకాలు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం ఎవరికి సీటు ఇస్తే వాళ్లే పోటీ చేస్తారని, తనకు టికెట్ ఇచ్చిన పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తనపై పోటీ చేసిన ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన వారిలా తిరుగుతూ మేడ్చల్ నియోజకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు.