Pratidwani : వర్షాభావం... రైతు ముందున్న మార్గం? - Pratidwani
🎬 Watch Now: Feature Video
Pratidwani : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు.. రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. జూన్ ఏదొకలా గడిచింది అనుకున్నా... వానాకాలం సాగుకు అత్యంత కీలకమైన జులైలోనూ..... లోటు వర్షపాతాలు కలవరపరుస్తున్నాయి. రాష్ట్రంలోని సగానికి పైగా మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువే అంటున్నాయి.. గణాంకాలు. వాతావరణ శాఖ ముందే వేసిన అంచనాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఈపాటికే మొలకలు వచ్చి పచ్చగా కనిపించాల్సిన పుడమి తల్లి.. నెర్రలు విచ్చుకుంటోంది. మరోవైపు భూగర్భ జలాలు అత్యంత వేగంగా పడిపోతుండటం కలవరపరిచే మరో అంశం. రోజురోజు రైతన్న ఆకాశం వేసి చూడటమే కనిపిస్తోంది. అడపాతడపా కురిసే వానలతో ఎలాంటి ప్రయోజనం లేదని వ్యవసాయ శాఖ నిపుణులు అంటున్నారు. భారీ వర్షాలు కురిస్తేనే.. పరిస్థితి మారుతుందని.. లేదంటే.. కరవు ఛాయలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. మరి... వ్యవసాయ రంగంపై ఈ అనావృష్టి ప్రభావం ఎలా ఉంది? ఖాళీ జలాశయాలు, జాడలేని భారీవర్షాలతో ఈసారి సాగు సాగేదెలా? పంటల ప్రణాళికల విషయంలో రైతులు, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.