Prathidwani : రాష్ట్రంలో జోరందుకున్న ఎన్నికల వాతావరణం.. హామీల రేసులో నెగ్గేదెవరు..? - ఈరోజు ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
Published : Oct 16, 2023, 9:19 PM IST
Prathidwani Debate on Telangana Political Parties Promise Race : ఉచితాలు, హామీలు.. ఎన్నికల సమయంలో పార్టీలకు ఇవి పదునైన అస్త్రాలు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు తమ హామీలను ప్రకటించేశాయి. మరో ప్రధాన పార్టీ మ్యానిఫెస్టో త్వరలో రానుంది. రాష్ట్రంలో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో హామీలు.. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చాయనడం అతిశయోక్తి కాదేమో. అందుకే ఈసారి ఎన్నికల్లో కూడా పార్టీలు తమ హామీలను ప్రజల ముందు ఉంచేందుకు రేసుగుర్రాల్లా పోటీ పడుతున్నాయి. అయితే ఒకర్ని మించి ఒకరు హామీలు ఇస్తున్న జోరులో రానున్న రోజుల్లో ఈ రేసు ఎలా ఉండబోతోంది? ఏ రాష్ట్రంలో ఎన్నికల హామీలతో పాటే చర్చకు వచ్చే విషయం ఆర్థిక పరిస్థితి.
ఇప్పుడు తెలంగాణలో పార్టీలిస్తున్న హామీల అమలుకు ఆర్థిక పరిస్థితులు ఎంతమేర సహకరించే అవకాశం ఉంది? సంపద పెంచాలి, పంచాలి అంటున్న నినాదం సాకారం కావాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీలు ఇలా.. మ్యానిఫెస్టోలు, హామీల రూపంలో ప్రజలకే ఎదురు పరీక్షలు పెడుతూ ఉంటాయి. ఈ విషయంలో ప్రజలు నాయకులను చూసి ఓట్లు వేయాలా? లేక ఆకర్షణీయమైన హామీలను చూసి ముందుకెళ్లాలా? ఈసారి ఎన్నికలపై హామీల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.