Drive Nine Mileage Booster Injection : కాలుష్యానికి అసలైన విరుగుడు డ్రైవ్9 - Uses of Drive Nine Mileage Booster Injection
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18564080-418-18564080-1684736587116.jpg)
Drive Nine Mileage Booster Injection : ప్రపంచ కాలుష్యానికి కారణం అవుతున్న వాటిలో ప్రధానమైనవి పెట్రోల్, డీజిల్ వాహనాలే. తీవ్ర స్థాయిలో అవి పర్యావరణానికి విఘాతం కలిగిస్తాయి. ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. మరి కాలుష్యానికి నష్టం చేకూర్చని వాహనాలు ఏంటంటే అవి ఎలక్ట్రిక్ వాహనాలే. ఒక్క ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే కాకుండా మరిన్ని మార్గాల్లోనూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆవిష్కర్తలు కృషి చేస్తున్నారు. ఇదే కోవలో ప్రయత్నం చేసిన విజయ్ అనే ఆవిష్కర్త ఓ మైలేజీ బూస్టర్ ఇంజక్షన్‌ను రూపొందించాడు. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాహనాల మైలేజీ కూడా మెరుగుపడుతుంది.
దాంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్‌ను ఈ ఇంజక్షన్‌తో ఆక్సిజన్‌గా మార్చవచ్చు అంటున్నారు విజయ్. డీఆర్డీఓ ఆమోదం పొందిన డ్రైవ్-నైన్ మైలేజీ బూస్టర్ ఇంజెక్షన్ అన్ని రకాల వాహనాలతో పాటు సైనిక వాహనాల్లోనూ వినియోగించవచ్చు. క్షిపణులు, యుద్దట్యాంకులు, జలంతర్గాములు, విమానాల్లోనూ ఇది పని చేస్తుందని ఆవిష్కర్త అంటున్నారు. ఇప్పటికే లక్షల వాహనాల్లో వినియోగించిన డ్రైవ్-నైన్ మైలేజీ బూస్టర్ ఇంజెక్షన్ అసలెలా పనిచేస్తుంది.? దీని ద్వారా వాహనదారులకు కలిగే లాభాలు ఏంటి.? ఇంతకీ ఆ ఇంజెక్షన్‌ను ఎలా రూపొందించారు.? తదితర విషయాలను డ్రైవ్9 మైలేజీ బూస్టర్ ఇంజెక్షన్ ఆవిష్కర్త విజయ్‌తో ముఖాముఖి.