Drugs in Hyderabad : డ్రగ్స్ పీడ విరగడ ఎలా?
🎬 Watch Now: Feature Video
Diseases caused by drugs : నేడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. ఎందరో యువత మత్తు వలలో పడి తమ జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. ఈ మాదకముఠాలు బడి ఈడు పిల్లల్ని కూడా చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌ల రూపంలో మత్తు ఊబిలోకి లాగుతున్నారన్న హెచ్చరికలున్నాయి. రాష్ట్రంలో, రాజధానిలో డ్రగ్స్ విపత్తు ఏ స్థాయికి చేరిందో.. వాటిని బానిసైన ఒక యువకుడి మరణం ఉలిక్కిపడేలా చేసింది. డ్రగ్స్ కేసులను సమూలంగా చేధించడంలో పోలీసులు, నార్కోటిక్ బ్యూరోలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నాయా? దర్యాప్తులపై ఏమైనా ఒత్తిళ్లు ఉండి వెనక్కి తగ్గుతున్నారా? టాలీవుడ్ డ్రగ్స్ కేసునే తీసుకుంటే కొన్నేళ్ల క్రితం అది ఎంత సంచలనమైందో.. ఇప్పుడు అంత స్తబ్దుగా మారిపోయింది. నషా ముక్త భారత్, మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ, ఇలా నినాదం, పథకం పేరు ఏదైనా.. డ్రగ్స్ నీడ లేని సమాజం కావాలంటే ఇకనైనా అధికార వ్యవస్థ ఏం చేయాలి? ఈ అంశంపై నేటి ప్రతిధ్వని