TS PRATHIDHWANI: వర్షాలకు తడిసిన ధాన్యం నష్టాలను ఎవరు భరించాలి? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
TS PRATHIDHWANI: రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల్లో లక్షలాది టన్నుల ధాన్యం వర్షాలకు తడిసి మొలకెత్తింది. బియ్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్ఠంభన.. ధాన్యం నిల్వల పాలిట శాపంగా మారింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెబుతూ గత నెలలో ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపేసింది. దీంతో గోడౌన్లలో ఖాళీ లేదంటూ రైస్ మిల్లర్లు మిల్లింగ్ ఆపేశారు. ఈ పరిస్థితుల్లో ఊహించని రీతిలో కురిసిన భారీ వర్షాలకు వేల కోట్ల రూపాయల ధ్యాన్యం నీటి పాలయ్యింది. ధాన్యం సేకరణ, బియ్యం కోటాల స్వీకరణ విషయంలో ఎట్టకేలకు కేంద్రం మంద్రి పీయూష్ గోయల్ సానూకూలంగా స్పందించారు. మరి ఇకనైనా పూర్తిస్థాయిలో సీఎంఆర్ సేకరణ మొదలవుతుందా? రాష్ట్రంలో వడ్ల కష్టాలు తీరుతాయా? ఇదే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST