ponguleti srinivas reddy : 'ఆ పార్టీలో చేరి.. కేసీఆర్ మరోసారి గెలవకుండా అడ్డుకుంటా' - సీఎం కేసీఆర్‌పై పొంగులేటి ఫైర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18298870-168-18298870-1681962453276.jpg)
ponguleti srinivas reddy Interview: భారత్ రాష్ట్ర సమితిని మూడోసారి అధికారంలోకి రాకుండా... కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాకుండా నిలువరించే పార్టీలోనే చేరుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు తన రాజకీయ పయనంపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఈ నెలాఖరులో ఖమ్మంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంతో... బీఆర్ఎస్పై యుద్ధం ప్రకటిస్తానన్న పొంగులేటి... ఎట్టిపరిస్థితుల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనీయబోనని మరోసారి పునరుద్ఘాటించారు.
ఆరేళ్లుగా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం కల్పించలేదని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వాపోయారు. పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారన్న పొంగులేటి.. అనుచరులకు పదవుల్లేక, ఎంపీ సీటు రాక అవస్థలు పడ్డామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తండ్రితో సమానంగా భావించానని... కానీ నమ్మించి నట్టేట ముంచారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి విముక్తి లభించిన తర్వాత... రావణాసురుడి కబంధ హస్తాల నుంచి బయటపడ్టట్టు ఉందని అన్నారు. అధికారం, ప్రభుత్వం చేతుల్లో ఉందని పొంగులేటిని భయపెట్టలేరన్న ఆయన... తన ఆర్థిక నేరాలు, భూదందాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని 'ఈటీవీ-భారత్' ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించారు.