Etela Rajender VS Jithender Reddy : 'ఏది పడితే అది మాట్లాడకూడదు'.. జితేందర్ రెడ్డి ట్వీట్‌పై ఈటల కామెంట్స్ - Etela Rajender Jithender Reddy Tweet
🎬 Watch Now: Feature Video
Etela Rajender Jithender Reddy Tweet : మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్లపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. జితేందర్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేశారో.. ఆయన ఉద్దేశం ఏంటో ఆయన్నే అడగాలని పేర్కొన్నారు. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. బాధ్యత మరిచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఏది పడితే అది మాట్లాడటం సరికాదని హితవు పలికారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించాలని సూచించారు. వ్యక్తుల స్వేచ్ఛ, గౌరవం తగ్గించకూడదని ఈటల వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బీజేపీలో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న వేళ.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ ఇటీవలే ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వాహనంలోకి బలవంతంగా గేదెలు ఎక్కిస్తున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని రాసుకొచ్చారు. దీనిపై పార్టీ వర్గాల్లో వ్యతిరేకత రాగా.. వెంటనే డిలీట్ చేశారు. దీనిపై ఆయన వివరణ కూడా ఇచ్చారు.