Etala Rajender On Guest Lecturers : 'గెస్ట్ లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రతతో పాటు.. 12నెలల జీతం ఇవ్వాలి' - Problems of Junior College Lecturers
🎬 Watch Now: Feature Video
Etala Rajender Demands On Guest Lecturers Problems : సీఎం కేసీఆర్ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు ఉండవని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గెస్ట్ లెక్చరర్స్ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ విద్యలో పనిచేస్తున్న తమని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఇంటర్ కమిషనర్ కార్యాలయాన్ని అతిథి అధ్యాపకుల ఐకాస ముట్టడించింది. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆక్షేపించారు. నిరసన చేస్తున్న అతిథి అధ్యాపకులను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు. గెస్ట్ లెక్చరర్ల అరెస్టును ఖండించిన ఈటల రాజేందర్ వారికి సంఘీభావం ప్రకటించారు. గెస్ట్ లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 12నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగరని ఈటల స్పష్టం చేశారు.