Employees Attending Duties Wearing Helmets : ఆఫీసులోనూ హెల్మెట్‌.. ధరించకపోతే ప్రాణాలకు లేదు గ్యారంటీ! - jagityal wearing helmets news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 8, 2023, 9:59 PM IST

Employees Attending Duties Wearing Helmets : జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు హెల్మెట్‌ ధరించి విధులకు హాజరవుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనంలోనే విధులను కొనసాగిస్తున్నారు. భవనంపై పెచ్చులు తరుచూ ఊడిపడుతుండడంతో ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన బీర్పూర్‌ మండలంలో ఓ ప్రైవేటు భవనంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ అధికారులు భవనం స్థితిని గుర్తించలేదు.

దీంతో హడావుడిగా నూతన మండలం ప్రకటన వెలువడిందే తరువాయి చకాచకా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటుచేసిన భవనంలో తరుచూ పెచ్చులు ఊడిపోతుండడంతో ఎప్పుడు తమ తలలు పగిలిపోతాయోనన్న భయం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందిలో నెలకొంది. విధులకు హాజరు కాకుంటే ఇబ్బంది తప్పదని భావించిన ఉద్యోగులు రెండు రోజలుగా తమ తలలకు హెల్మెట్లు పెట్టుకుని డ్యూటీలు చేస్తున్నారు. గృహలక్ష్మీ దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు ఎక్కువగా రావడంతో దరఖాస్తులు తీసుకునేందుకు ఆరుబయట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.