Edupayala Durga Bhavani Temple : ఇంకా జలదిగ్బంధంలోనే ఏడుపాయల దుర్గామాత ఆలయం - ఏడుపాయల దుర్గమ్మ దేవాలయానికి వరద

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2023, 7:01 PM IST

Huge Flood Water At Edupayala Durga Bhavani Temple : దేశంలోనే రెండో వనదుర్గా మాత ఆలయం, జనమేజయుని సర్పయాగస్థలిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మెదక్‌ జిల్లాలోని పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం నాలుగో రోజు కూడా జలదిగ్బంధంలోనే ఉంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ఉన్న మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీటితో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. 

దీనికి తోడు పటాన్‌చెరు సమీపంలోని నక్కవాగు నీరు కూడా మంజీరాతో కలవడంతో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వనదుర్గా ప్రాజెక్టు నుంచి 12,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నీరు విడుదల చేయడంతో దిగువన ఉన్న వనదుర్గా ఆలయం ముందున్న నదీపాయ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయ ఈవో, అర్చకులు ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసేసి.. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్లీ విగ్రహాన్ని ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించి.. పూజలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.