నకిలీ టీవీలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు - సోనీ టెలివిజన్ పేరుతో భారీ మోసం
🎬 Watch Now: Feature Video
Duplicate Sony TV Selling : బ్రాండెడ్ కంపెనీల టీవీల పేరుతో నకిలీ టీవీలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం పులుమామిడి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక కారుతో పాటు రెండు యాక్టివా వాహనాలపై సోనీ కంపెనీకి చెందిన టీవీలు తరలిస్తుండగా అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. విక్రయిస్తున్న టీవీలు నకిలీగా గుర్తించిన పోలీసులు తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇద్దరు పరారయ్యారు. దీంతో పరారీలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Nine Arrested for Selling Duplicate TV : వికారాబాద్ డీఎస్పీ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టుబడిన ముఠా సోనీ కంపెనీ పేరుతో నకిలీ టీవీలను ప్రజలకు అమ్ముతున్నారు. వీరి నుంచి 71 నకిలీ టీవీలు, ఒక కారు, ఒక వ్యాన్, 7 యాక్టివా ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీలో ఉన్న పవన్ శర్మ, సలీం అనే వ్యక్తులు ఈ ముఠా సభ్యులను గ్రామాల్లోకి పంపి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపారు.