న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో డ్రగ్ టెస్టులు : రాచకొండ సీపీ - newyear hyderabad
🎬 Watch Now: Feature Video


Published : Dec 31, 2023, 4:47 PM IST
|Updated : Dec 31, 2023, 5:04 PM IST
Drugs Tests in Hyderabad 2023 : నూతన సంవత్సర వేడుకలను అందరూ ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు కోరారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు టీఎస్ న్యాబ్ క్విక్ రెస్పాన్స్ కిట్‌లతో డ్రగ్స్ టెస్టులను చేయనున్నట్లు తెలిపారు. భాగ్యనగరంలో డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
Rachakonda CP on New Year Celebrations 2024 : రాత్రి ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభిస్తున్నట్లు, మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. న్యూయర్ వేడుకలు నిర్వహించే బార్, రెస్టారెంట్‌లకు నిబంధనలను వివరించినట్లు తెలిపారు. న్యూయర్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరగాలంటే ప్రజలు పోలీసులతో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. రాచకొండ పరిధిలో ప్రత్యేకంగా డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తామంటున్న సీపీ సుధీర్ బాబుతో మా ప్రతినిధి ముఖాముఖి.