కాామారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు-జెడ్పీటీసీపై ఎంపీపీ దాడి - కామారెడ్డిలో కేసీఆర్ పోటీ
🎬 Watch Now: Feature Video
Published : Nov 4, 2023, 8:04 PM IST
Disputes in BRS Party in Kamareddy District : కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్గపోరు బయటపడింది. మాచారెడ్డి మండల ఎంపీపీ నర్సింగరావు.. జడ్పీటీసీ రాంరెడ్డిపై దాడి చేశాడు. నర్సింగరావు చేసిన దాడికి నిరసనగా.. జేడ్పీటీసీ స్వగ్రామంలో ఆందోళనకు దిగారు. చుక్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను రాంరెడ్డికి అప్పగించగా.. సదరు గ్రామంలో మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు తన అనుచరులతో కలిసి ప్రచారం చేశారు. తన గ్రామంలో ప్రచారం చేయొద్దని జేడ్పీటీసీ రాంరెడ్డి అభ్యంతరం తెలపడంతో.. ఆగ్రహించిన నర్సింగరావు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
Clashes in Kamareddy BRS Party : ఈ దాడిని జెడ్పీటీసీ రాంరెడ్డి అనుచరులు ఖండించారు. దాడిలో గాయపడిన ఆయనను.. కామారెడ్డిలోని ఆయన నివాసంలో వారంతా పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంటి వద్దకు భారీగా చేరుకుని.. నర్సింగరావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయపడిన జెడ్పీటీసీకి.. నర్సింగరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్.. పార్టీ నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.