Prathidwani : సిక్స్ ప్యాక్ కోరుకునే వారి.. కసరత్తులు, ఆహార ప్రణాళికలు ఇలా ఉండాలి..! - Good Exercises for Six Pack Body
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-07-2023/640-480-19009262-802-19009262-1689433740249.jpg)
Good Exercises for Six Pack Body : దేహ దారుఢ్యం.. సిక్స్ ప్యాక్ కోసం.. ఆరాటంలో కృత్రిమ బల వర్ధకాలు కల్లోలం రేపుతున్నాయి. సహజ సిద్ధమైన ఆహారం, శారీరక వ్యాయామాలతో సాధించాల్సిన కండపుష్టిని కృత్రిమ పద్ధతుల ద్వారా పొందాలనుకోవడం.. యువత ఆరోగ్యాలకు పొగ పెడుతోంది. అపోహలు, కొందరు జిమ్ ట్రైనర్లే పక్కదోవ పట్టించడం, ఇలా కారణాలు ఏవైనా.. సమస్య రోజు రోజుకీ పెరుగుతోంది. కృత్రిమ కండపుష్టి కోసం ప్రొటీన్ పౌడర్లు, ఔషధాలు, ఇంజక్షన్లు అమ్ముతున్న గ్యాంగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కండలు పెంచాలనుకునే వారు ఇన్‌స్టంట్‌గా ఫలితాలు రాబట్టాలనుకోవడంతో సమస్య తలెత్తుతోంది. ఈ విషయంలో తక్షణం తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏమిటి? కండపుష్టిని సప్లిమెంట్స్‌తో ప్రయత్నిస్తే ఏంటి నష్టం? కండ పుష్టికి సప్లిమెంట్స్‌ను వాడడం తప్పనిసరా? దేహదారుఢ్యం.. సిక్స్‌ప్యాక్.. కోరుకునే వారి.. కసరత్తులు, ఆహార ప్రణాళికలు ఎలా ఉండాలి? ఈ విషయంలో ప్రచారమేంటి? వాస్తవాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.