Deer Fell in Canal video : కాలువలో పడ్డ దుప్పి.. పైకి వచ్చేందుకు ఎన్ని తిప్పలు పడిందో చూశారా..? - నీ
🎬 Watch Now: Feature Video

Deer Fell in Canal Peddapalli Video : రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి కుంటలు, బావులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మొన్నటి వరకు తాగడానికి సరిగా నీరు దొరక్క ఇబ్బందిపడిన జంతువులు, పక్షులకు.. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలతో ఉపశమనం లభించినట్లైంది. ఇలా.. తాజా వర్షాలతో నిండిన ఓ కాలువలో దాహం తీర్చుకోవడానికని వచ్చిన ఓ దుప్పి.. అదుపు తప్పి ఆ కాలువలో పడిపోయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ శివారులో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఈ రోజు తెల్లవారుజామున దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన ఓ దుప్పి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. అందులో నుంచి పైకి వచ్చే ప్రయత్నంలో దుప్పికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. గ్రామస్థుల సహకారంతో దుప్పిని బయటకు తీశారు. అనంతరం గాయాల పాలైన దుప్పిని.. వైద్య పరీక్షల నిమిత్తం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పశు వైద్యశాలకు తరలించారు.