కలిసి ఉంటే కలదు సుఖం అంటూ ట్రెండ్ సెట్ చేస్తున్న సీఎం రేవంత్, ప్రధాని మోదీ - రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ భేటీ చర్చపై డిబెట్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 10:26 PM IST

Debate on Revanth Reddy And Narendra Modi Meet : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాదాపు గంట పాటు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకఅంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలిపారు ఇరువురు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి ప్రధానంగా  చర్చించినట్టు సమాచారం. ఐతే.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అదీ స్వయంగా తనే ప్రధాని సమయం కోరినట్లు అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించిన స్వల్ప వ్యవధిలో ఈ భేటీ జరిగింది.

రాష్ట్రాల సహకారం లేకుండా కేంద్రము, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాలు తమ లక్ష్యాలను చేరలేవు. ప్రధానంగా కలిసి పనిచేసే విషయంలో ఎక్కడ తరచు ప్రతిష్టంభన ఏర్పడుతోంది అని మీ అభిప్రాయం? రాష్ట్రాలు, కేంద్రము కలిస్తేనే దేశాభివృద్ధి అని, తామంతా టీమ్ ఇండియా అని ప్రధాని మోడీ ఎప్పుడూ అంటూంటారు. ఈ భేటి ఎంతవరకు ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది? రాజకీయాలు వేరు... రాష్ట్ర ప్రయోజనాలు వేరంటున్న ఈ పరిణామాలపై నేటి ప్రతిధ్వని.    

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.