ఎన్నికల వేళ హామీల యుద్ధం - విజయకేతనం ఎగురవేసేది ఎవరో? - election campaign telangana
🎬 Watch Now: Feature Video
Published : Nov 24, 2023, 10:14 PM IST
Debate on Election Guarantees by Political Parties : అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో రోజురోజుకీ కాకరేపుతునే ఉన్న అంశం.. హామీల యుద్ధం. మేం అధికారంలో వస్తే ఏం చేస్తామో అని చెబుతునే... ప్రత్యర్థులహామీలపై పదునైన విమర్శలు ఎక్కుపెడుతున్నాయి పార్టీలన్నీ. అధికార బీఆర్ఎస్– విపక్ష కాంగ్రెస్ మధ్య మరింత తీవ్రస్థాయిలో ఉంది ఈ వేడి. మరి, హామీలు సరే, వాటి అమలుకు వారి వద్ద ఉన్న ప్రణాళికలేంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నింటికీ ఎంత వరకు సహకరిస్తుంది? వనరులు ఎలా సమీకరిస్తారు? బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా అనేక ప్రత్యేక ఆకర్షణలున్నాయి. దాదాపు అన్నివర్గాలపై హామీల జల్లునే కురిపించారు.
Election Guarantees by Political Parties : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నింటి అమలుకు సహకరిస్తుందా? కాంగ్రెస్(Congress)వి అలవికానీ హామీలని భారాస విమర్శిస్తోంది. ఇదే సమయంలో మీ పార్టీ హామీలు కూడా కాంగ్రెస్ హామీలకు ఏ మాత్రం తీసిపోవట్లేదు. వీటిని అమలు చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా? ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చారు. ప్రజలపై ఎలాంటి అదనపు భారం వేయకుండానే వీటిని అమలు చేయటం సాధ్యమేనా? ప్రజలపై ఎలాంటి అప్పులు, అదనపు భారాలు లేకుండానే చెప్పినవన్నీ చేసి చూపిస్తామని భరోసా కల్పించగలరా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.