Symptoms of eye infections : కళ్లకలకలు వచ్చాయని ఎలా గుర్తించాలి?.. జాగ్రత్తలు ఏమిటి? - Precautions to be taken in case of eye infections
🎬 Watch Now: Feature Video
Eye problems in Telangana in Telugu : కళ్లు మంటలు, ఎర్రబడటం, కళ్లవెంట నీరు కారటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే కళ్ల కలకలు సోకి ఉండొచ్చు తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రంలో నిత్యం వందల సంఖ్యలో కళ్లకలకల కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని ఒక్క సరోజినీ దేవి కంటి ఆస్పత్రికే రోజుకి కనీసం వందకు పైగా కంటి కలకల బాధితులు వస్తున్న పరిస్థితి చూస్తే.. రాష్ట్రంలో వ్యాధి తీవ్రతకు అద్ధం పడుతోంది. ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలంలో కళ్లకలకలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది మరింత ఎక్కువ మొత్తంలో వ్యాప్తి చెందుతుందన్నాయని వైద్యులు తెలిపారు. వానలో అధికంగా తడిసినందున కంట్లోకి నీరు చేరడంతో ఇన్ఫక్షన్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ సమస్య వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంటి కలకలు ఎలా వ్యాప్తి చెందుతాయి? ఈ విషయంలో వైద్యుల సూచనలు ఏంటి? అనే అంశాలపై సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజాలింగంతో ముఖాముఖి.