నాయకుల మధ్య మాటల యుద్ధం - హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు - Bhatti Vikramarka Respond on KTR Comments
🎬 Watch Now: Feature Video
Published : Dec 16, 2023, 4:22 PM IST
Congress vs BRS War in Assembly 2023 : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ వేళ శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దీన్ని గడ్డం వివేక్ వెంకటస్వామి బలపర్చారు.
KTR Speech in Assembly 2023 : అనంతరం, మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్(KTR) ఐదేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతుందో గవర్నర్ ప్రసంగం ద్వారా తెలుస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాతీరును ప్రస్తావిస్తూ సభలో కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రులు పొన్నం, భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన విధ్వంసాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు చేయకుండా చరిత్రను ముందుకు తెచ్చి, విమర్శలు చేయటం సరికాదన్నారు.
CM Revanth Reddy Speech in Assembly : గవర్నర్ ప్రసంగంలోని ఇందిరమ్మ పాలన అంశాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ ఆనాటి పాలనలో నిర్బంధం, ఆకలి కేకలు మాత్రమే ఉండేవన్నారు. కేటీఆర్ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తీవ్రస్థాయిలో స్పందించారు. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం కాదన్న కేసీఆర్, హరీశ్‌రావు సహా ఆనాడు ఎంతో మందికి కాంగ్రెస్ పార్టీతోనే పదవులు వచ్చాయన్నారు. పొతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపుపై సొంత పార్టీ నేత పీజేఆర్ పోరాడారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.