ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి - తెలంగాణ కాంగ్రెస్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-11-2023/640-480-20002909-thumbnail-16x9-congress-mla-candidate-lb-nagar-madhuyaski.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 11, 2023, 9:53 PM IST
Congress MLA Candidate Madhu Yaskhi Goud Interview : అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటేసి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ దూసుకెళ్తోన్న శైలిని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవకుండా ప్రయత్నిస్తున్నాయని.. మధుయాష్కీ విమర్శించారు.
నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజల్లో సెటిలర్ల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయని దుయ్యబట్టారు. అదేవిధంగా పార్టీ ఫిరాయింపులు చేసే వారిని అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా చేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే మార్పు వస్తుందని ఎల్బీ నగర్ ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు మధుయాష్కీ వివరించారు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్తున్నట్లు, తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని అంటున్న ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.