వినూత్న ప్రచారానికి తెరలేపిన కాంగ్రెస్ అభ్యర్థి మధు యాస్కీ - మెట్రోలో ఓట్ల అభ్యర్థన - మెట్రోలో మధుయాస్కీ వెరైటీ ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
Published : Nov 21, 2023, 2:15 PM IST
Congress Leader Madhu Yashki Variety Election Campaign : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తూ.. తమకే ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి నిర్వహించే ఎన్నికల ప్రచారం నూతన ఒరవడులను అంది పుచ్చుకుంటుంది. ఎన్నికల ప్రచారం సాంకేతిక పుంతలు తొక్కుతుంది. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఎప్పటికప్పుడు నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు.
Congress Election Campaign in Telangana : తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ వినూత్న ప్రచారానికి తెరలేపారు. ప్రచారంలో భాగంగా ఆయన.. సాధారణ ప్రజల్లో ఒకడిగా కలిసిపోయి ఎల్బీనగర్ నుంచి మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడుతూ.. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని.. నేడు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుందని మధుయాస్కీ పేర్కొన్నారు.
Madhu Yashki Variety Election Campaign in Metro Train : కాంగ్రెస్ పార్టీ విజనరీ పార్టీ అని.. ఏ ప్రాజెక్టు రూపొందించినా భవిష్యత్ తరాలకు బ్రహ్మాండంగా ఉపయోగపడేలా కలకాలం నిలిచేలా ఉంటుందని మధుయాస్కీ వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన రెండేళ్లకి ప్రమాద దశకు చేరిందని.. జవహర్ లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ కట్టిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ చెక్కుచెదరలేదని... అదీ కాంగ్రెస్కు ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ.. కమీషన్లు కాంట్రాక్టులు అంటూ తెలంగాణలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. భవిష్యత్ తరాల నిధిని కాపాడేది కాంగ్రెస్ ఒకటేనని.. ప్రజలు విశ్వాసముంచి తమకోసం పిల్లల భవిష్యత్ కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని మధుయాస్కీ కోరారు.